నిర్మల్ జిల్లా పెంబిలో జ్యోతి వంతెన నిర్మించాలని కలెక్టర్ కార్యాలయం ఎదుట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొన్నేళ్లుగా.. వంతెన నిర్మాణం చేపట్టాలని గ్రామ ప్రజలు అనేక సార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వంతెన నిర్మిస్తే పది గ్రామాల ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయి. ఇప్పటికైనా.. అధికారులు స్పందించి వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారికి వినతి పత్రం అందజేశాం.
-తొడసం శంభు, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి