Bus Seized: హైదరాబాద్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ (UP 05 OCT 1368) బయల్దేరింది. ప్రయాణికుల హడావుడితో బస్‌లో అంతా గందరగోళంగా ఉంది. ప్రయాణం సాఫీగానే సాగుతుంది. అలా... బస్ నిర్మల్ జిల్లాలోకి ప్రవేశించింది. ఇంతలో బస్ సోన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్దకు చేరుకుంది. అక్కడే తనిఖీలు చేస్తున్న రవాణాశాఖ అధికారులు ఆ బస్‌ను సీజ్ చేశారు.
పరిమితికి మించి ప్రయాణికులు బస్‌లో ఉండటమే కారణమని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. 40 మంది ప్రయాణికులకు అనుమతి ఉన్న వాహనంలో దాదాపు నాలుగింతల ప్రయాణికులను తీసుకెళ్లడం చట్టరీత్య నేరమని వారు చెబుతున్నారు. ఇలా ప్రయాణించడం సురక్షితం కాదన్నారు. అధిక ప్రయాణికులతో వెళ్లేటప్పుడు జరగరానిది ఏమైనా జరిగితే ప్రమాదం ఊహించని స్థాయిలో ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిమితికి మించి ప్రయాణించే ఏ వాహనమైనా అదుపులోకి తీసుకొని కోర్టుకు అప్పజెబుతామని అధికారులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: