నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పలువురు భాజపా నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. వారిని దిలావర్పూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టైన వారిని మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పరామర్శించారు.
రైతు వేదిక భవనాల్లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని ఆయన స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కోసం తెరాస ప్రభుత్వం రైతు వేదికలపై ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఏర్పాటు చేయడం సరికాదని విమర్శించారు. పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తుగా భాజపా నాయకులను అరెస్టు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రైతు వేదిక భవనాలపై ప్రధాని, ఎంపీ సోయం బాబూరావు చిత్రపటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'కేంద్రానిది పాత పాటే.. లేఖలో కొత్త అంశాలేమీ లేవు'