నిర్మల్ జిల్లా మామడ మండలంలోని వాస్తాపూర్కు చెందిన గర్భిణీకి 108 సిబ్బంది పురుడు పోశారు. శోభ అనే గర్భిణికి పురిటినొప్పులు మొదలు కాగా... కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ వెళ్లేసరికి ఆలస్యం కాగా నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ శేఖర్, పైలెట్ హఫీజ్, ఆశా కార్యకర్త కవిత... శోభకు ధైర్యం చెప్పి ఇంటి వద్దే ప్రసవం చేశారు.
ఆమె మూడో కాన్పులో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆశా కార్యకర్త తెలిపారు. ప్రసవ సమయంలో వైద్య సేవలు అందించిన అంబులెన్స్ సిబ్బందికి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి : ఆనందయ్య మందు.. కోటయ్య మృతి