నిర్మల్ జిల్లాలోని 18 మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోంది. అభ్యర్థుల తుది విడత నామపత్రాల స్వీకరణ గురువారం ముగిసింది. ఐదు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు 51, ఎంపీటీసీ పదవులకు 303 మంది అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. ఐదు ఎంపీటీసీ స్థానాలను తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. నిర్మల్ మండలంలో 7ఎంపీటీసీ స్థానాలకుగానూ రెండు ఎంపీటీసీ స్థానాలు తెరాస ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మిగిలిన 5 స్థానాల్లో మరో రెండు స్థానాలు గెలిస్తే ఎంపీపీ పదవిని గులాబీ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంది. కొండాపూర్ ఎంపీటీసీ కొరిపెల్లి రామేశ్వర్ రెడ్డిని నిర్మల్ ఎంపీపీ చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం.
ఇవీ చూడండి: హైదరాబాద్లో ఐటీ ఉద్యోగుల కోసం షటిల్ బస్సులు