నిర్మల్ జిల్లా తనూర్ మండలంలో జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆధ్వర్యంలో పోలీసులు, వ్యవసాయ అధికారులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. విత్తనాలు, ఎరువుల దుకాణాలపై దాడులు చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన పురుగుల మందులు, విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. కాలం చెల్లిన పురుగుల మందులను గుర్తించి సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం వీటి విలువ సుమారు 8లక్షలు పైగా ఉంటుందని ఎస్పీ వెల్లడించారు.
ఇవీచూడండి: కారును ముంచిన రోడ్డు రోలరు!