ETV Bharat / state

ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కోసం... కలెక్టర్​కు అనాథ పిల్లల వినతి! - నిర్మల్​ కలెక్టర్​

తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఇద్దరు పిల్లలు తమకు ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్​ కల్పించాలని నిర్మల్​ జిల్లా కలెక్టర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పిల్లల వినతి పత్రం అందుకున్న కలెక్టర్​ వెంటనే స్పందించి వారికి అడ్మిషన్​ ఇప్పించారు. వారికి ఏం కావాలన్నా.. తనను సంప్రదించాలని.. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సాధించాలని కలెక్టర్​ సూచించారు.

Orphan Girls Request for Hostel Admission to Nirmal Collector
ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్ కోసం... కలెక్టర్​కు అనాథ పిల్లల వినతి!
author img

By

Published : Sep 3, 2020, 10:04 PM IST

నిర్మల్​ జిల్లా లోకేశ్వరం మండలం నగర్​ గ్రామంలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన గౌతమి, పూజలు తమకు ఆశ్రమ పాఠశాలలో అడ్మిషన్​ కల్పించాలని గురువారం నిర్మల్​ జిల్లా కలెక్టర్​ ముషర్రఫ్​ ఫారుఖీని కలిసి వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన కలెక్టర్​ వారికి ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో అడ్మిషన్​ ఇప్పించారు. చనిపోయిన పిల్లల తల్లి పేరు మీద ఉన్న వ్యవసాయ భూమిని వారసత్వ పట్టా మార్పిడి చేయాలని, పిల్లలకు రైతు భీమా అందేలా చర్యలు తీసుకోవాలని, కొత్త రేషన్​ కార్డు, స్త్రీ నిధి, పంట రుణం ఇప్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తమ సమస్యను విని వెంటనే పరిష్కరించిన కలెక్టర్​కు పిల్లలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్​ సహా ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.