ETV Bharat / state

బెల్టు దుకాణం తొలగించాలని వినతిపత్రం

బెల్టు దుకాణంలో మద్యం సేవించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నిర్మల్ జిల్లా ఓల గ్రామానికి చెందిన పలువురు ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

బెల్టు దుకాణం తొలగించాలని వినతిపత్రం
బెల్టు దుకాణం తొలగించాలని వినతిపత్రం
author img

By

Published : Oct 5, 2020, 4:56 PM IST

నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓల గ్రామంలో బెల్టు దుకాణాన్ని తొలగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో పలువురు వినతిపత్రం అందజేశారు. బెల్టు దుకాణంలో కల్తీ మద్యం విక్రయించడం వల్ల గ్రామస్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగుతున్నాయని ఎంపీటీసీ కట్టా రవి ఆరోపించారు. ఎక్సైజ్ అధికారులు స్పందించి గ్రామంలోని బెల్ట్ దుకాణం తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సాదు ప్రభాకర్ రెడ్డి, తుమ్మల రాజ్ కుమార్, అయిటి భీంనాథ్, ఏడోల్ల భోజన్న, కీని శ్రీనివాస్, బొంతల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: శాంతి భద్రతలపై ఈ నెల 7న సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.