కరోనా ప్రభావం వల్ల పాఠశాలలు మూతబడి.. వేతనాలు లేక ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులను తక్షణమే ఆదుకోవాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని.. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.
జీవో నెంబర్ 45ను అమలు చేస్తూ.. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే బోధనా, బోధనేతర సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని కోరారు. నెలవారి జీతాల మీద ఆధారపడి బతికే ప్రైవేట్ ఉద్యోగులు చేతిలో చిల్లిగవ్వ లేక దుర్భర జీవితాలు అనుబవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంజాద్ షేక్, ఆమెడ శ్రీకాంత్, కుంట ఉదయ్ గౌడ్, లతీఫ్, అయ్యన్నగారి రాజేందర్, కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్హా, సయ్యద్ అర్షద్, ప్రైవేటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మహబూబాబాద్‌లో అపహరణకు గురైన బాలుడు హత్య