నిర్మల్ జిల్లా పెంబి మండల ప్రభుత్వ పాఠశాల మరమ్మతులు, అభివృద్ధి కోసం తెరాస జిల్లా ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్ లక్షన్నర విరాళంగా ఇచ్చారు. చెక్కును గ్రామ సర్పంచ్ పూర్ణ చందర్ గౌడ్‌కు అందజేశారు. 10 రోజుల క్రితం యాబై వేలు ఇవ్వగా... మరింత అభివృద్ధి కోసం లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
తాను చుదువుకున్న పాఠశాల శిథిలావస్థలో ఉన్నందున తనకు తోచినంత సాయం చేయాలనే ఉద్దేశంతో విరాళం ఇచ్చినట్టు రాంచందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, వీడీసీ అధ్యక్షులు కుర్మా రాజేందర్, ఉప సర్పంచ్ స్వప్నిల్ తదితరులు పాల్గొన్నారు.