ఎల్‌ఆర్‌ఎస్, ఉద్యోగుల వేతనాల పెంపుపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. నిర్మల్ మున్సిపల్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ రాష్ట్రాభివృద్ధితోపాటు.. ప్రజలకు మేలు చేయాలన్నదే సీఎం లక్ష్యమని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉన్న ఏకైక ప్రభుత్వమని తెలిపారు.
అన్ని వర్గాలకు అండగా..
రాష్ట్రాభివృద్ధితోపాటు ప్రజలకు మేలు చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండదండగా ఉన్న ఏకైక ప్రభుత్వమని తెలిపారు.
ఇదీ చదవండి:కొత్త 'స్ట్రెయిన్'పై రాష్ట్రాలకు కేంద్రం లేఖ