నిర్మల్ జిల్లాలోని మూడు కేంద్రాల్లో ఈనెల 16న కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ధనరాజ్ తెలిపారు. పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని.. కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రి, రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బైంసాలోని ప్రాంతీయ ఆసుపత్రిలోని వైద్య సిబ్బందికి తొలివిడత వ్యాక్సిన్‌ను అందజేయనున్నట్లు ధనరాజ్ పేర్కొన్నారు. ఈనెల 18నుంచి మరో 25 కేంద్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: జిల్లాలకు చేరిన కొవిడ్ వ్యాక్సిన్లు.. పంపిణే తరవాయి