రైతు వేదికలను అన్ని హంగులతో దసరా నాటికి సిద్ధం చేయాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ఆదేశించారు. జిల్లాకు మంజూరైనా 79 రైతు వేదికలకు గాను ఇప్పటివరకు 70 పూర్తి అయ్యాయని, మిగతావి నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో కలిసి సోమవారం సాయంత్రం సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో రైతు వేదికను పరిశీలించారు.
'నాణ్యత లోపిస్తే సహించేది లేదు'
పల్లె ప్రగతిలో భాగంగా జిల్లాలో చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటి... పచ్చదనం ఉట్టిపడేలా విరివిగా నాటాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనుల పురోగతిని పర్యవేక్షించాలని ఆదేశించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపిస్తే సహించేది లేదని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: మళ్లీ వరుణ ప్రతాపం.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం