నిర్మల్ జిల్లాలో పట్టణ, పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ఆదేశించారు. నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపల్ కమిషనర్లతో కలెక్టరేట్‌లో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీకృత మార్కెట్, డంపింగ్ యార్డులు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్మాణాల పనులపై కలెక్టర్ సమీక్షించారు.
పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని చెప్పారు. పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల్లో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలని వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న వైకంఠ ధామాలను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు హేమంత్, డా. పి. రాంబాబు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి: మంత్రులు