నిర్మల్ కలెక్టరేట్లో గురువారం ప్రభుత్వ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ముషరఫ్ ఫారూఖీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికలు, డంపింగ్ యార్డు స్మశాన వాటికలు, రైతు కల్లాల నిర్మాణాలను వేగవంతం అయ్యేలా ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
మీసేవ దరఖాస్తులను, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. తమ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేలా రెవెన్యూ అధికారులు ముఖ్య పాత్ర పోషించాలని కలెక్టర్ తెలిపారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని ధర్మసాగర్ చెరువు గట్టుపై జాతీయ పతాకం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు.
ఇవీ చూడండి: కొందరిలో కొవిడ్ ఉన్నా.. పరీక్షల్లో నెగిటివ్..