నిర్మల్ జిల్లాలో హరితహారం కార్యక్రమం పకడ్బందీగా చేపట్టి.. నిర్దేశించిన లక్ష్యాన్ని, గడువు నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారుఖీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. అధికారులు సమన్వయంతో ఆరవ విడత హరితహారంలో జిల్లాకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి రోజు శాఖల వారిగా నాటిన మొక్కల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఆగస్టు 31నాటికీ ప్రతి శాఖ తమకు నిర్దేశించిన లక్ష్యం వందశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇవీచూడండి: భారత్ బయోటెక్ ల్యాబ్‌ను సందర్శించిన మంత్రి కేటీఆర్