యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ (కస్టం మిల్లింగ్ రైస్) సరఫరా లక్ష్యాన్ని వెంటనే పూర్తిచేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సీఎంఆర్ సరఫరాపై సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. త్వరలోనే వానాకాలం ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున జిల్లాలోని 9 రైస్ మిల్లుల్లో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రతిరోజు మూడు షిఫ్ట్ లలో పని జరగాలని ఆదేశించారు.
మిల్లర్లు, అధికారులు, తహసీల్దార్లు సమన్వయంతో పనిచేయాలని.. రోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు. త్వరితగతిన లక్ష్యం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇవీచూడండి: విద్యార్థుల వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం