నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పాలానాధికారి ముషారఫ్ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామ సమీపంలో నిర్మిస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను... రహదారులు, భవనాల శాఖ, రెవెన్యూ అధికారులు, గుత్తేదారులతో కలిసి పరిశీలించారు.
కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను ఫిబ్రవరి-2021 నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఫారూఖీ ఆదేశించారు. మిషనరీ, కూలీల సంఖ్యను పెంచి దశలవారీగా నిర్మాణ పనులను చేపట్టి... సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాఠోడ్ రమేశ్, రహదారులు భవనాల శాఖ ఈఈ అశోక్ కుమార్, తహసీల్దార్ సుభాశ్ చందర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.