ETV Bharat / state

'ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి' - telangana news

ధాన్యం కొనుగోలు కేంద్రాలపై.. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ కలెక్టరేట్​​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు.

nirmal collecter
nirmal collecter
author img

By

Published : Apr 29, 2021, 5:48 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్​లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్రాల నుంచి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని వారికి సూచించారు.

జిల్లాలో 189 కేంద్రాలకు గాను.. ఇప్పటికే 54 కేంద్రాలను ప్రారంభించినట్లు కలెక్టర్​ పేర్కొన్నారు. ఇప్పటివరకు 2, 450 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలతో తీసుకురావాలని రైతులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్​డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, తహసీల్దార్​లు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: టీకా కేంద్రాల వద్ద బారులు... వేచిచూసినా దొరకని వ్యాక్సిన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.