ETV Bharat / state

లాక్​డౌన్​ సమయంలోని రూ.5 వేలు ఇవ్వాలని ఆశాల ఆందోళన - asha workers protest in nirmal

నిర్మల్​లో ఆశా కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. లాక్​డౌన్ సమయంలో విధులు నిర్వహించిన తమకు... ప్రభుత్వం ఇస్తామని చెప్పిన 5 వేల పారితోషికాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

asha workers protest in nirmal
నిర్మల్​లో ఆశాకార్యకర్తల ఆందోళన
author img

By

Published : Jun 15, 2020, 6:31 PM IST

కరోనా సమయంలో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఇస్తామన్న 5 వేల పారితోషకం చెల్లించాలంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. చేతిలో ఫ్లకార్డులు పట్టుకొని ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా వచ్చిన సీఐటీయూ జిల్లా నాయకుడు దాదేమియాను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.

లాక్​డౌన్ సమయంలో అందరూ ఇంటికే పరిమితమైతే... తాము మాత్రం ఇంటింటికీ తిరిగి సర్వే చేశామన్నారు. అందుకు అప్పట్లో 5 వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. విధుల నిర్వహణలోనూ అధికారుల వేధింపులు పెరిగాయని అన్నారు. తమకు ఉద్యోగ భద్రత కలిపిస్తూ... ఆఎస్​ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.

ఇవీ చూడండి: దారుణం: ఇద్దరు పిల్లలను చెరువులో తోసేసిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.