రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన పంటను విక్రయించు కోవాలని ఏఏంసీ ఛైర్మన్ నర్మద ముత్యం రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు.
వరి ధాన్యం విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని ముత్యం రెడ్డి అన్నారు. ఏ గ్రేడ్‌కు రూ.1,888, బీ గ్రేడ్‌కు రూ.1,868 మద్దతు ధరను చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : ఆ 3 చోట్ల ఓట్ల లెక్కింపుపై భాజపా ఏజెంట్ల అభ్యంతరాలు...