ETV Bharat / state

'సోయా రైతులు ఆందోళన చెందొద్దు.. అన్నివిధాలా ఆదుకుంటాం' - నిర్మల్​ జిల్లా కలెక్టర్​

నిర్మల్​ జిల్లా ముధోల్​ మండలంలో సోయా పంటలను కలెక్టర్​ ముషారఫ్​ అలీ ఫారూఖీ పరిశీలించారు. సోయా విత్తనాలు మెులకెత్తలేదని రైతులు ఆందోళన చెందవద్దని... ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

niramal collector visited soya farms in mudhol mandal
'సోయా రైతులు ఆందోళన చెందొద్దు.. అన్ని విధాలా ఆదుకుంటాం'
author img

By

Published : Jun 23, 2020, 8:19 PM IST

నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో సోయా విత్తనాలు మొలకెత్తలేదని రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా పాలనాధికారి ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ముధోల్​లో సోయా వేసిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ విత్తనాలు విత్తినప్పటికీ మొలకెత్తలేదని, చాలా నష్టపోయామని తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని విన్నవించారు. రైతులు ఆందోళన చెందవద్దని అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్​ భరోసా ఇచ్చారు.

ఇప్పటికే జిల్లాలో వ్యవసాయాధికారులు సర్వే పూర్తి చేశారని.. ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిహారం అందేలా చూస్తామని ఆయన చెప్పారు. చాలామంది రైతులు వ్యవసాయాధికారులు వచ్చే వరకూ ఇతర పంటలు వేయాలా వద్ద అన్ని సందిగ్ధంలో ఉన్నారని కలెక్టర్​ను అడిగారు. వ్యవసాయాధికారుల వద్ద నమోదు చేసుకుంటే సరిపోతుందని.. ఇతర పంటలు వేసుకోవచ్చని జిల్లా కలెక్టర్​ రైతులకు సూచించారు.

ఇవీ చూడండి: కలిసి పోరాడాల్సిన సమయంలో రాజకీయాలేంటి: ఎంపీ రంజిత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.