గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని నిర్మల్ జిల్లా సోన్ మండల పరిషత్ అధ్యక్షురాలు బర్ల మానస రెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని గంజాల్, జాఫ్రాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయన్నారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు జీవన్ రెడ్డి, ఎంపీటీసీ నాగయ్య, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ ఫక్రోద్దిన్, పీఏసీఎస్ ఛైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి, సర్పంచ్‌లు లావణ్య నవీన్, సునీత, ఉప సర్పంచ్ గంగయ్య, మాజీ సర్పంచ్ ప్రకాశ్ రెడ్డి, ఎంపీడీవో ఉషారాణి, ఎంపీవో అశోక్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం: ఇంద్రకరణ్‌రెడ్డి