నిర్మల్ జిల్లాలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన భైంసా పట్టణంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 9 గంటల వరకు 15.72శాతం పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకురాలు శృతిహోజా పరిశీలించారు.
వారం క్రితం జరిగిన సంఘటన దృష్ట్యా భైంసాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ ద్వారా మానిటరింగ్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక బలగాల ద్వారా పలు కాలనీల్లో పహారా కాస్తున్నారు.
ఇవీ చూడండి: హలో ఓటర్.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!