నిర్మల్ జిల్లా ముక్తాపూర్ గ్రామస్థులు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. హైందవ జాగృతికి, హిందూ సంప్రదాయ పరిరక్షణ కోసం శివాజీ ఎంతగానో కృషి చేశారని శివాజీ ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజు అన్నారు.
ఈ నెల 23 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు వడ్లకొండ అలివెలు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు రజని, ప్రధాన కార్యదర్శి స్వప్న, నాయకులు రవీందర్ గౌడ్, గంగాధర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా