లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయాలని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పోలీసులను ఆదేశించారు. కంటైన్‌మెంట్ జోన్ ప్రాంతాలను డ్రోన్ కెమెరాతో ఎస్సీ పరిశీలించారు. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు డ్రోన్ కెమెరాలతో నిరంతరం పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సిబ్బందికి సూచించారు.
లాక్‌డౌన్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైరస్ విస్తరిస్తున్న దృష్ట్యా ప్రజలు, పోలీసు సిబ్బంది ప్రతిఒక్కరూ వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.