నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి దృష్ట్యా భక్తులు నిరాడంబరంగా శోభాయాత్రను నిర్వహిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. పరిమిత సంఖ్యలో భక్తులు గణనాథుడిని పల్లకిపై నెలకొల్పి.. పాదయాత్రగా తీసుకెళ్లారు. బొజ్జ గణపయ్యను జనం ఆసక్తిగా తిలకించారు.
![Modest Ganesh Immersion Celebrations in Nirmal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-adb-31-30-ganeshnimajjan-av-ts10033_30082020112357_3008f_1598766837_809.jpg)
ఇదీచూడండి.. మలిసంధ్యలో అమ్మానాన్నకు ఆదరణ కరవు...