పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని 13 వ వార్డులో పట్టణ ప్రగతి సందర్భంగా జేసీ భాస్కరరావు, అధికారులతో కలిసి విఠల్‌రెడ్డి పర్యటించారు. పారిశుద్ధ్యం, మురుగు కాలువల నిర్వహణ, విద్యుత్ లైన్ల క్రమబద్దీకరణ వంటి అంశాలను పరిశీలించారు. సమస్యలపై ఆరా తీశారు.
ఇవీచూడండి: నేటి నుంచే పట్టణ ప్రగతి... పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపే లక్ష్యం