నిర్మల్ జిల్లా భైంసా ఎంపీడీవో కార్యాలయంలో ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సుమారు 154 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే తరోడా చర్చి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని క్రిస్మస్ సంబురాలను కేక్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సోదరులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. క్రైస్తవులకు దుస్తులను పంపిణీ చేశారు.
ఇదీ చూడండి : అమ్మాయిల్ని కాదు.. అబ్బాయిల్ని జాగ్రత్తగా చూసుకోండి: హరీశ్ రావు