ETV Bharat / state

Mission Bhagiratha Leak: పగిలిన మిషన్ భగీరథ పైప్​లైన్.. ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు - ts news

Mission Bhagiratha Leak: మిషన్​ భగీరథ పైపు లీకై పెద్దఎత్తున నీరు వృథా అయింది. రహదారి పక్కనే పైపులు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఎగసిపడుతున్న నీటి దృశ్యాలను స్థానికులు సెల్​ఫోన్స్​లో బంధించారు.

Mission Bhagiratha Leak: పగిలిన మిషన్ భగీరథ పైప్​లైన్.. ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు

author img

By

Published : Jan 3, 2022, 2:01 PM IST

Mission Bhagiratha Leak: పగిలిన మిషన్ భగీరథ పైప్​లైన్.. ఉవ్వెత్తున ఎగిసిపడిన నీరు

Mission Bhagiratha Leak: నిర్వహణ లోపంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ నీరుగారిపోతుంది. పనుల్లో జరిగిన లోపంతో పైపులు లీకేజీ అయి భారీగా నీటి నష్టం జరుగుతోంది. గత 4 నెలల క్రితం నిర్మల్​ పట్టణంలోని మంజిలాపూర్ వద్ద లారీ ఢీకొట్టటంతో పైప్​లైన్ పగిలి సుమారు గంటకుపైగా నీరు వృథా కావడం, జాతీయ రహదారి కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

తాజాగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ ఆర్కే కన్వెన్షన్ హాల్ సమీపంలో రహదారిపై భగీరథ పైపు లైన్ పగలడంతో మంచి నీరు వృథాగా నేలపాలు అవుతోంది. సోమవారం ఉదయం నీరు ఒక్కసారిగా బయటికి రావడంతో అదుపు చేయలేకపోయారు. అర్ధగంట పాటు నీరు ఎగజిమ్ముతుండటతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. పగిలిన పైప్​లైన్ మరమ్మతులు చేసేందుకు సంబంధితశాఖ అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. ఎగసిపడుతున్న నీటి దృశ్యాలను స్థానికులు తమ చరవాణుల్లో బంధించారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.