ETV Bharat / state

'అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి' - మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్​ ఏరియా ఆస్పత్రిలో మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి అంబులెన్స్​లను ప్రారంభించారు. అంబులెన్స్‌ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.

minister indrakaranreddy started in nirmal hospital

author img

By

Published : Oct 27, 2020, 8:02 PM IST

'గిఫ్ట్‌ ఏ స్మైల్‌' కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన 108 - అత్యవసర ప్రతిస్పందన అంబులెన్స్‌ సేవలను నిర్మల్​లోని ఏరియా ఆసుపత్రిలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అంబులెన్స్‌ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ అంబులెన్సులు ఎంతగానో ఉపయోగపడుతాయని తెలిపారు.

మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ స్ల్మైల్‌ కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత నిధులతో రూ. 61.50 లక్షలతో 3 అంబులెన్స్​లను సమకూర్చామన్నారు. వాహనాల్లో ఆక్సీజన్‌, వెంటిలేటర్‌తో సహా... అత్యాధునిక సదుపాయాలను కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్​పర్సన్ కె.విజయలక్ష్మి రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస యువజన నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిదులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వేడెక్కిన దుబ్బాక ఉపఎన్నిక రాజకీయం... కొనసాగుతోన్న ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.