ETV Bharat / state

చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దు: ఇంద్రకరణ్​ రెడ్డి

విదేశాల నుంచి వచ్చిన వారు వైద్య పరీక్షలకు సహకరించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కోరారు. నిర్మల్​ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరికి కరోనా రాలేదని స్పష్టం చేశారు. అనుమానంగా ఉన్నవారిని హైదరాబాద్​ గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధలో ఉండి.. సామాజిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు. చిన్న చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దని మంత్రి సూచించారు.

author img

By

Published : Mar 27, 2020, 10:25 AM IST

చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దు: ఇంద్రకరణ్​ రెడ్డి
చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దు: ఇంద్రకరణ్​ రెడ్డి
చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దు: ఇంద్రకరణ్​ రెడ్డి

విదేశాల నుంచి వచ్చిన వారు ఆరోగ్య పరీక్షలకు సహకరించాలని రాష్ట్ర దేవాదాయ, గృహ అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. నిర్మల్​లోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్​ను ఆయన సందర్శించారు. వసతులు, అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

కరోనాతో ప్రపంచమంతా అల్లాడి పోతుందని.. అలాంటి వ్యాధి మన దగ్గర విస్తరించకుండా ఉండాలంటే ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు ఏ ఒక్కరికి ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ కాలేదన్నారు. ఇలాగే కొనసాగిస్తే అందరికీ శ్రేయస్కరమని పేర్కొన్నారు.

అనుమానంగా ఉన్నవారిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే పోలీసులు ఎక్కడికక్కడా చెక్​పోస్టులు పెట్టి వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండి కొవిడ్​-19ను తరిమికొడదామని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కోరారు. చిన్న చిన్న తప్పులతో జీవితాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు.

ఇదీ చూడండి: నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.