రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు మధుసూధనాచారి స్మారక క్రికెట్ టోర్నమెంట్ నిర్మల్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ప్రారంభమైంది. క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి... క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. తనకు 20 ఏళ్ల పాటు వ్యక్తిగత సహాయకుడిగా మధుసూధనాచారి చేసిన సేవలను కొనియాడారు.
నిర్మల్ పట్టణంలో అందరికీ సుపరిచితులుగా ఉంటూ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆప్యాయతతో పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గండూరి ఈశ్వర్, వైస్ ఛైర్మన్ సయ్యద్, కౌన్సిలర్లు సయ్యద్ సలీం, పూదారి రాజేశ్వర్, నాయకులు రాంకిషన్ రెడ్డి, సల్మాన్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.