ETV Bharat / state

'ఆరో విడత హరితహారం లక్ష్యాన్ని వందశాతం సాధించాలి' - ఆరో విడత హరితహారం

లాక్​డౌన్​తో ప‌ర్యావ‌ర‌ణం బాగా మెరుగైంద‌ని, ఆ ఫ‌లితాల‌ను కొన‌సాగించేలా అట‌వీ శాఖ ప‌నితీరు ఉండాల‌ని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అధికారులకు సూచించారు. మంచి వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో... ఆరో విడత హరితహారం కార్యక్రమ లక్ష్యాన్ని వందశాతం సాధించాలని మంత్రి ఆదేశించారు.

Harithaharam updates
Harithaharam updates
author img

By

Published : Jun 6, 2020, 7:10 PM IST

ప్రతి ఉద్యోగి పూర్తి జవాబుదారీతనంతో నాటిన ప్రతి మొక్క వందకు వందశాతం బతకాలనే లక్ష్యంతో పనిచేయాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఆరో విడత హరితహారం ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అటవీ అధికారులతో మంత్రి... నిర్మల్ నుంచి దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.

పంచాయతీరాజ్ చట్టం తరహాలోనే...

ఇప్పటి వరకు అడవుల వెలుపల 151కోట్లు, అడవుల్లో 30 కోట్ల మొక్కలు నాటామన్న పీసీసీఎఫ్ శోభ... అటవీశాఖ నాటిన చోట్ల 85 శాతానికిపైగా, ఇతర చోట్ల కొంత తక్కువ శాతం మెుక్కలు బతుకుతున్నాయని వివరించారు. పంచాయతీరాజ్ చట్టం తరహాలోనే 85శాతం మొక్కలు బతకపోతే సదరు అటవీఅధికారి, సిబ్బందిని బాధ్యుల్ని చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ దఫా అడ‌వుల బ‌య‌ట 20 కోట్లు,‌ అడ‌వుల్లో కోటీ 90 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శోభ మంత్రికి వివరించారు.

సాంకేతిక సహకారాన్ని అందించాలి....

ఇప్పటికే జిల్లాలు, శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించినట్లు శోభ చెప్పారు. పంచాయతీరాజ్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నందున గ్రామాలు, పట్టణాల్లో అటవీశాఖ తరపున సాంకేతిక సహకారాన్ని అందించాలని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి సూచించారు. నర్సరీలకు వెళ్లినపుడు అటవీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులను కలవాలని పేర్కొన్నారు. లాక్​డౌన్​తో ప‌ర్యావ‌ర‌ణం బాగా మెరుగైంద‌ని, ఆ ఫ‌లితాల‌ను కొన‌సాగించేలా అట‌వీ శాఖ ప‌నితీరు ఉండాల‌ని చెప్పారు.

హ‌రిత స్ఫూర్తిని చాటేలా...

క‌రోనా నేప‌థ్యంలో హ‌రిత స్ఫూర్తిని చాటేలా హ‌రితహారం లోగోతో ఉన్న ఆకుప‌చ్చని మాస్కుల‌ను ధ‌రించాల‌ని మంత్రి తెలిపారు. మంచి వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ నివేదికల నేపథ్యంలో వందశాతం లక్ష్యాన్ని జియోట్యాగింగ్​తో సహా సాధించాలని మంత్రి ఆదేశించారు.

కోటి చింత మెుక్కలు నాటాలి...

ఈ దఫా కోటి చింత మొక్కలు నాటి భవిష్యత్​లో రాష్ట్రానికి చింతపండు దిగుమతి అవసరం లేకుండా చూడాలని అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఆడిట్ పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. థర్డ్ పార్టీ ద్వారా పెరిగిన పచ్చదనం, బతికిన మొక్కల శాతాన్ని కచ్చితంగా లెక్కించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.