ETV Bharat / state

ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి - ఇంటి పరసరాలను శుభ్రం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్​లోని తన ఇంటి ఆవరణలో మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి డ్రై డే పాటించారు. ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు 10 నిమిషాలు కేటాయించి... ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

minister indrakaran reddy perform dry day activity in nirmal house
ఇంటి పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
author img

By

Published : Jul 12, 2020, 1:08 PM IST

ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు కేటాయించి... ఇంటిని, పరిసరాలను శుభ్రం చేసుకుందామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఆవరణలో మొక్కల మధ్య కలుపు తీసి, నీటి గుంతలు తవ్వారు. పరిసరాలను శుభ్రం చేసి మొక్కలకు నీళ్లు పట్టారు. అనేక సీజనల్ వ్యాదులకు కారణమవుతున్న దోమల నివారణకు ప్రతి ఆదివారం ఇంటి పరిసరాల్లో నిలిచి ఉన్న నీటిని ఖాళీ చేయాలని సూచించారు.

ఇళ్లలో, పరిసర ప్రాంతాలలో పరిశుభ్రత పాటించడం వల్ల పొడి వాతావరణం ఏర్పడి దోమల లార్వా, క్రిమీకీటకాల ఉత్పత్తి నివారణకు అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రై డే పాటించి, ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్ రాంరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, తెరాస పట్టణ అధ్యక్షులు మారుగొండ రాము, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ఆయన ప్రాణం కాపాడండి: వరవరరావు సతీమణి హేమలత

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.