రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఒక చరిత్రగా చెప్పుకోవచ్చని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి(indra karan reddy) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంతోపాటు కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు(telangana formation day 2021) నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ తల్లి, ఆచార్య జయంశంకర్ చిత్ర పటం, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి నివాలులర్పించారు.
14 ఏళ్ల పోరాటం అనంతరం సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్(CM KCR) ఎన్నో అభివృద్ధి పనులు చేశారని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. కరోనా కారణంగా గత ఏడాది కాలం నుంచి ఎవరికి కష్టం కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జడ్పీ ఛైర్మన్ విజయలక్ష్మి, మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పాలకోసం బయటకు వస్తే.. పైశాచికంగా కొట్టాడు.!