రాష్ట్రంలో ప్రతి మహిళ సంతోషంగా బతుకమ్మ పండగ జరుపుకోవాలని సీఎం కేసీఆర్ ఒక పెద్దన్నగా పుట్టింటి చీరలు అందిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. కోటి మందికి చీరలు పంపిణీ చేశారన్నారు. నిర్మల్ జిల్లా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వం రూ.327 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రతి సంవత్సరం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
మహిళా సోదరీమణులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణానే అని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. కొవిడ్ సమయంలో కూడా సాంప్రదాయాలు అంతరించిపోకుండా నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి: కరోనా నిబంధనలతో బతుకమ్మ సంబరాలు