నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని ఆడెల్లి గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆహ్వాన ప్రతులు, గోడ ప్రతులను మంత్రి అల్లోల ఇంద్ర కరణ్ రెడ్డి ఆవిష్కరించారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. కొవిడ్ నిబంధనలు పాటించాలని, శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేయాలన్నారు.
ఆడెల్లి పోచమ్మ తల్లి ఆశీస్సులతో.. నిర్మల్ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా త్వరగా నశించిపోవాలని కోరుకున్నారు.
ఇదీ చూడండి: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగండం