ETV Bharat / state

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి అల్లోల - minister indrakaran reddy started road works at nirmal

దిలావర్​పూర్ మండల కేంద్రం నుంచి బన్సపల్లి గ్రామం వరకు నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.3 కోట్ల 45 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి పనులను ప్రారంభించారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

minister indrakaran reddy inaugurated the road works in nirmal district
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి అల్లోల
author img

By

Published : Nov 10, 2020, 12:54 PM IST

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్​పూర్ మండల కేంద్రం నుంచి బన్సపల్లి గ్రామం వరకు రూ.3కోట్ల 45 లక్షల నిధులతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వీరేశ్​ కుమార్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు డా.సుభాష్ రావు, ఎంపీపీ ఎలాల అమృత, పీఏసీఎస్ ఛైర్మన్ రమణ రెడ్డి, నాయకులు దేవేందర్ రెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: దుబ్బాకలో ఆరు రౌండ్లు పూర్తి.. తగ్గిన భాజపా ఆధిక్యం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.