నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఓలా గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంను ప్రారంభించారు. అనంతరం సబ్‌స్టేషన్, రైతు వేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
రెండు నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో ధర్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. 'రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక' అని దేశంలో పలువురు నాయకులు ఉపన్యాసాలు చేసి వదిలేస్తారు. తెలంగాణలో కేసీఆర్ మాత్రమే పట్టుదలతో రైతుల కోసం అభివృద్ధి పనులను చేపడుతూ.. ఆ దిశగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల సర్పంచ్‌లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెరాస కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కొవిడ్ వ్యాక్సినేషన్‌పై ప్రజారోగ్య సంచాలకుడి సమీక్ష