ETV Bharat / state

'రహదారుల నిర్మాణానికి త్వరగా అనుమతులివ్వండి' - అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా.. ప్రభుత్వం, ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో రహదారుల నిర్మాణానికి చర్యలు వేగవంతం చేసిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. పనులు సజావుగా సాగేందుకు.. సంబంధిత అధికారులు కృషి చేయాలని కోరారు.

Minister Indrakaran Reddy held a review meeting with forest officials in Nirmal district
'రహదారుల నిర్మాణానికి త్వరగా అనుమతులివ్వండి'
author img

By

Published : Mar 3, 2021, 10:22 PM IST

ఉమ్మడి ఆదిలాబాద్​ జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన రహదారుల నిర్మాణానికి.. త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో అటవీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో రహదారుల నిర్మాణానికి.. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని మంత్రి పేర్కొన్నారు. పనులు సజావుగా సాగేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. ఖానాపూర్, పెంబి, మామాడ తదితర మండలాల్లో క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించి నివేదికను సమర్పించాలని వారిని ఆదేశించారు.

ఈ సమావేశంలో.. జడ్పీ ఛైర్​పర్సన్ విజయ లక్ష్మీ, అటవీశాఖ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కట్టుకున్న భార్యపై ముళ్ల పొదల్లోకి లాక్కెళ్లి హత్యాయత్నం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.