గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద, గిరిజన, మైనార్టీ, వెనుకబడిన వర్గాలకు చెందిన బాలికలకు ఉచితంగా విద్యను అందించేందుకే కేజీబీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు... మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నిర్మల్ జిల్లా అనంతపేట్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవన నిర్మాణానికి... జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారూఖీతో కలిసి ఆయన భూమి పూజ చేశారు.
రూ. 3 కోట్ల 50 లక్షల వ్యయంతో పాఠశాల భవన నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో ఇంటర్ కళాశాలను సైతం నిర్మిస్తామని తెలిపారు. విద్యతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, ప్రతి ఒక్కరూ చదువుకుని సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు. అంతకుముందు నూతనంగా నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఇదీ చదవండి: ఆరేళ్ల బాలికపై హత్యాచార నిందితుడికి ఉరిశిక్ష