నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను ప్రతీ ఒక్కరు గుర్తించాలని మంత్రి పిలుపునిచ్చారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల చెరువులు, బావులు, ప్రకృతికి కలుషితమవుతుందన్నారు.
పర్యావరణ పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని, ప్రజలంతా మట్టి విగ్రహాలనే పూజించాలని మంత్రి సూచించారు. ప్రజలను అతలాకుతలం చేస్తున్న కరోనా తగ్గిపోవాలని ప్రజలంతా ఇంట్లోనే భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్లు రాజు, వేణు, రాజేశ్వర్, నరేందర్, తెరాస పట్టణ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: నాగార్జునసాగర్ 4 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు