పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో 128 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గడంతో చెక్కుల పంపిణీ ఆలస్యం అయిందని తెలిపారు.
రైతులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని మంత్రి వివరించారు. రైతు బంధు, ఉచిత విద్యుత్, రైతు బీమా లాంటి పథకాలు దేశంలో ఎక్కడాలేని విధంగా అమలు చేస్తున్నామన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని రైతులు, రెవెన్యూ అధికారులు శాలువాతో సత్కరించారు.
ఇదీ చదవండి : 'బాబ్రీ' కేసు తీర్పుతో భాజపా వాదన నిజమైంది: డీకే అరుణ