ETV Bharat / state

కొవిడ్​ కట్టడిలో వారి పాత్ర కీలకమైనది: ఇంద్రకరణ్​ రెడ్డి

కొవిడ్​ కట్టడిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో మంత్రి సోదరుడు అల్లోల సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు భోజనం అందించారు.

Telangana news
నిర్మల్​ వార్తలు
author img

By

Published : Jun 4, 2021, 9:09 AM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లకు మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి సోదరుడు సురేందర్​ రెడ్డి భోజనం అందించారు. మహమ్మారి కట్టడికి పారిశుద్ధ్య కార్మికుల ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తూ ఫ్రంట్​లైన్​ వారియర్​ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.

వైద్యులు, న‌ర్సులు, పారామెడిక‌ల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వ‌ర్క‌ర్లు, పోలీసులు, ఇత‌ర ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు త‌మ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో వారి చేస్తున్న సేవలకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. కార్యక్రమంలో డెయిరీ ఛైర్మన్​ లోక భూమా రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కౌన్సిలర్లు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: Palamooru Mango: పాలమూరు మామిడికి మహర్దశ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.