ETV Bharat / state

'పన్ను ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం' - రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాలను పేద, బడుగు, బలహీన వర్గాలు లబ్ధి పొందేలా సమన్వయంతో పని చేసి పూర్తి చేయాలని ఎంపీ సోయం, మంత్రి ఇంద్రకర్​రెడ్డి అన్నారు.

minister indra karan reddy review on different departments of nirmal district developments
'పన్ను ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం'
author img

By

Published : Feb 14, 2020, 8:04 PM IST

'పన్ను ఆదాయంతోనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం'

ప్రజలు పన్ను రూపంలో అందించిన డబ్బు ద్వారానే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందని రాష్ట్రదేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రజలు చెల్లించిన డబ్బుతోనే ప్రభుత్వాలు సంక్షేమం పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.

నిర్మల్​ జిల్లా కలెక్టరేట్​లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్​ కమిటీ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. పేద ,బడుగు ,బలహీన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ సోయం బాపూరావు అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా పింఛన్​దారులకు ఇబ్బంది కలగకుండా జిల్లాలో అదనంగా పోస్టాఫీసులు ఏర్పాటు చేయాలని మంత్రి పోస్టల్​ శాఖను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిర్మించిన వ్యక్తిగత మరుగుదొడ్లను ప్రజలు వాడేలా పంచాయతీ కార్యదర్శులు చూడాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.