ఐఐటీ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్షలో ఆల్ ఇండియా స్థాయిలో 238 ర్యాంకు సాధించిన విద్యార్థి పల్లెపు మణికంఠను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అభినందించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యార్థిని శాలువా, పుష్ప గుచ్ఛంతో సత్కరించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కాళేశ్వరం ఆలయ డైరెక్టర్ కొరిపెల్లి దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్ల వెంకట్రామ్ రెడ్డి, కౌన్సిలర్ సంపంగి రవి, నాయకులు ముత్యం రెడ్డి, ఆమెడ శ్రీధర్, బోండ్ల గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీచూడండి: కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి : లక్ష్మణ్