లాక్‌డౌన్ గడువును మరింత పొడిగించటం వల్ల పనులు లేక ఓ వలస కుటుంబం నానా అవస్థలు పడుతూ.. రిక్షాలో సొంతూరికి పయనమైనంది. మహారాష్ట్ర హిమాయత్‌నగర్‌కు చెందిన దిగంబర్.. తన కుటుంబంతో సహా భైంసా, కుంటాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటుక బట్టీల్లోనూ, వ్యవసాయ కూలీలుగానూ పనిచేస్తున్నారు.
ఓ వైపు వ్యవసాయ, గ్రామీణ ప్రాంత చిన్నతరహా పరిశ్రమల్లో పనులకు లాక్‌డౌన్ ఆంక్షలకు సడలింపుందని ఆశ పడినప్పటికీ వలస కూలీలకు పనులు లభించడం లేదు. దీంతో ఓ వలస కుటుంబం నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణం గుండా మండుటెండలో ఓ రిక్షాలో సామగ్రితో పాటు ఇలా తమ స్వస్థలానికి బయలుదేరుతున్నారు. వారికి సేవాభారతి ప్రతినిధి ఆడెపు శ్రీనివాస్ ఆర్థికసాయం, ఆహార పదార్థాలు అందించారు.