Instagram AI Profile Picture Generation Feature: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫీచర్ యూజర్లు ఏఐ సహాయంతో అద్భుతమైన ప్రొఫైల్ ఫొటోలను క్రియేట్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి.
ఇన్‌స్టా ఏఐ ప్రొఫైల్ పిక్చర్ జనరేషన్ ఫీచర్: డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ ఇన్‌స్టాగ్రామ్ పనిచేస్తున్న ఈ కొత్త ఫీచర్ గ్లింప్స్ థ్రెడ్స్‌లో పోస్ట్ చేశారు. అందులో ఇన్‌స్టాగ్రామ్‌లో వారి ప్రొఫైల్ చిత్రాన్ని అప్‌డేట్ చేస్తున్నప్పుడు.. 'Creat An AI Profile Picture' అనే కొత్త మెనూ ఆప్షన్ చూపిస్తున్నట్లు కన్పిస్తుంది. ఆ తర్వాత డెవలపర్ దాని స్క్రీన్ షాట్ తీసి థ్రెడ్స్‌లో షేర్ చేశారు.
ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉండటంతో ఇది ఎలా పనిచేస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే ఇది మెటా లామా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)కి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ రెండు విధాలుగా పని చేస్తుంది. ఇది టెక్స్ట్ బేస్డ్ ప్రాంప్ట్‌లను ఉపయోగించి స్క్రాచ్ నుంచి AI ఇమేజ్ రూపొందించడానికి, ఇప్పటికే ఉన్న ప్రొఫైల్ పిక్చర్స్‌ను AIని ఉపయోగించి డిఫరెంట్ స్టైల్స్‌లో మార్చేందుకు ఉపయోగపడుంది.
అయితే ఇదేం ఇన్‌స్టాగ్రామ్ మొదటి ఏఐ ఫీచర్ కాదు. మెటా యాజమాన్యంలోని ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే చాట్‌బాట్ మెటా ఏఐ అందుబాటులో ఉంది. కంపెనీ DM మెసేజ్‌ల కోసం AI రీరైట్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. ఇది యూజర్‌కు పంపించిన మెసెజెస్‌ను రీరైట్ చేసేందుకు, మార్చేందుకు ఉపయోగపడుతుంది.
ఇదిలా ఉండగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ యాడ్స్‌ను గుర్తించేందుకు ఏఐ-పవర్డ్ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ ఏదైనా యాడ్‌లో సెలబ్రిటీల ఫొటోస్ ఉపయోగించినా, మోసం జరిగినట్లు అనుమానం వచ్చినా వాటిని గుర్తించి వాటిని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేసేస్తుందని మెటా తెలిపింది. దీనిపై మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్- టీజర్ చూస్తే మతిపోతోందిగా..!
'ఫస్ట్ ఇన్ ఇండియా'- కొత్త సర్వీస్ తెచ్చిన BSNL- వారికి 500 లైవ్‌టీవీ ఛానల్స్ ఫ్రీ!