నిర్మల్ జిల్లా మామడ మండలం బుర్కపల్లికి చెందిన మావోయిస్టులుసునీల్, గంగుబాయ్ అలియాస్ లత ఎట్టకేలకు జన జీవన స్రవంతిలో కలిశారు. 2001 నుంచి మావోయిస్టు పార్టీలో కొనసాగిన ఈ దంపతులు అజ్ఞాతం వీడారు.కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్ ముందు లొంగిపోయారు. అజ్ఞాతం వీడి సాధారణ జీవితం గడిపేందుకు ముందుకొచ్చారని ఆయన తెలిపారు.జిల్లాలో ఇంకా నలుగురు మావోయిస్టులు ఉన్నారని, ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రమోద్‌కుమార్ సూచించారు.
ఇవీ చదవండి :కేంద్రం కీలక నిర్ణయాలు